సినిమాపేరు : నువ్వే నువ్వే || సంగీత దర్శకుడు : కోటి || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : రాజేష్,కౌసల్య
పల్లవి:
అమ్మాయి నచ్చేసింది ఆహ్వానం ఇచ్చేసింది
ఓ ముద్ద మందారం లా ముస్తాబయ్యింది
వైశాఖమొచ్చేసింది ఇవ్వాళ రేపో అంది
ఓ మంచి మూర్తం చూసి సిద్ధం కమ్మంది
ఈ కబురు విన్న ఎదలో ఎన్నెన్ని పొడుపు కధలో
మనువే కుదిరీ మునుకే చెదిరి మురిపెం ముదిరి నా మనసు నిలవనంది
కొమ్మల్లో చిలకా మోమాటపడక వచ్చి వాలమ్మా
అమ్మాయి నచ్చేసింది ఆహ్వానం ఇచ్చేసింది
ఓ ముద్ద మందారం లా ముస్తాబయ్యింది
చరణం1
ఏ గాలి రొజూలా వీస్తున్నా ఈవేల వేరేల వింటున్న
సన్నాయి రాగాలుగా
నా వైపు రోజూలా చూస్తున్నా ఈవాళ ఏదోలా అవుతున్న
నీ కన్ను ఏమన్నదో
నా ఈడు ఏం విన్నదో
ఆశ పెట్టి పెట్టి పెట్టి చంపొద్దమ్మా ఇట్టా
నువ్వు పట్టి పట్టి పట్టి చూస్తూ ఉంటే ఎట్టా
ఎన్నెన్నొ.. అంటించి.. ఉక్కిరి బిక్కిరి అవుతున్న
కొమ్మల్లో చిలకా మోమాటపడక వచ్చి వాలమ్మా
అమ్మాయి నచ్చేసింది ఆహ్వానం ఇచ్చేసింది
ఓ ముద్ద మందారం లా ముస్తాబయ్యింది
చరణం2
ముత్యాల మేనాలే రప్పించి మేఘాల వీధుల్లో తిప్పించి
ఊరేగనీ హాయిగ
అందాల హద్దుల్నే తప్పించి వందేళ్ళ కౌగిల్నే అందించీ
ఉరించు ఆ వేడుక
ఓ.. ఊహించనీ నన్నిలా
ఎంత గిచ్చి గిచ్చి రెచ్చ గొట్టేలా నువ్వు
ఇంక పిచ్చి పిచ్చి పిచ్చి పెంచేస్తొందే నువ్వు
కవ్వించి కరిగించి మరిగే వయసుని కాపాడు
కొమ్మల్లో చిలకా మోమాటపడక వచ్చి వాలమ్మా
అమ్మాయి నచ్చేసింది ఆహ్వానం ఇచ్చేసింది
ఓ ముద్ద మందారం లా ముస్తాబయ్యింది
ఓ.. ఓ.. ఓ.. ఈ కబురు విన్న ఎదలో ఎన్నెన్ని పొడుపు కధలో
మనువే కుదిరీ మునుకే చెదిరి మురిపెం ముదిరి నా మనసు నిలవనంది
కొమ్మల్లో చిలకా మోమాటపడక వచ్చి వాలమ్మా