సినిమాపేరు : కిక్ || సంగీత దర్శకుడు : ఎస్ .ఎస్ .థమన్ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : చిత్ర
పల్లవి :
అటు చూడొద్దన్నానా మాటాడొద్దన్నానా
ఒద్దొద్దు అంటే విన్నావంటే మనసా
ఏం పరవాలేదనుకున్నావేమో బహుశా
ఈ తలనొప్పేదైనా నీ తప్పేంలేదన్నా
అయ్యయ్యో అంటారేమో గానీ మనసా
పడవలసిందేగా నువిలా నానా హింస
ప్రేమని కదిలించావే తోచీతోచని తొలి వయసా
ఎందుకు బదులిచ్చావే తెలిసి తెలియని పసి మనసా
చరణం 1
మునుపేనాడూ ఏ కుర్రాడు పడలేదంటే నీ వెనకాలా
వందలు వేలు ఉండుంటారు మతి చెడలేదే ఇలా వాళ్ళందరి వల్లా
ఎందుకివాళే ఇంత మంటెక్కిందో చెబుతావా
ఏం జరిగుంటుందంటే అడిగినవాళ్ళని తిడతావా
అందరి లాగా వాణ్ణి వీధుల్లో వదిలెసావా
గుండెల గుమ్మందాటి వస్తుంటే చూస్తున్నావా
చరణం 2
ఏ దారైనా ఏ వేళైనా ఎదురౌతుంటే నేరం తనదే
ఇంట్లో ఉన్నా నిదరోతున్నా కనిపిస్తుంటే ఆ చిత్రం నీలో ఉందే
ఎవ్వరినని ఏం లాభం ఎందుకు ఎద లయ తప్పిందే
ఎక్కడ ఉందో లోపం నీతో వయసేంచెప్పిందే
అలకో ఉలుకో పాపం ఒప్పుకునేందుకు ఇబ్బందే
కనకే నాకీకోపం కన్నెగా పుట్టిన నామీదే
అటు చూడొద్దన్నానా మాటాడొద్దన్నానా
ఒద్దొద్దు అంటే విన్నావంటే మనసా
ఏం పరవాలేదనుకున్నావేమో బహుశా
ఈ తలనొప్పేదైనా నీ తప్పేంలేదన్నా
అయ్యయ్యో అంటారేమో గానీ మనసా
పడవలసిందేగా నువిలా నానా హింస