సినిమాపేరు : గమ్యం || సంగీత దర్శకుడు :మూర్తి ,అనిల్ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : సునీత
పల్లవి :
చాల్లేగాని ఏంటా పరాకు
ఉన్నట్టుండి ఏమైంది నీకు
అయ్యో అని worryఐపోకు
tell me అని enquiryలన్ని ఎందుకు
మాతోనే నువ్వుంటూ మా ఊసే పట్టనట్టు
ఏదోలా ఎందుకుంటావ్ నీదీలోకం కాదన్నట్టు
ఒదిగుందే లోని గుట్టు
కదిలిస్తే తేనె పట్టు
వదలదుగా వెంటపడుతు
నాకేం తెలుసిది ఇంతేనంటు
మునిగేదాక లోతన్నది
కొలిచే వీలు ఏమున్నది
పరవాలేదు అంటున్నది
ప్రేమలో పడ్డది
చరణం 1
ఆమె చెంపలా కందిపోవడం
ఏమి చెప్పడం ఎంత అద్భుతం
అందుకే కదా కోరి కోరి కయ్యాలు
అతని కోసమే ఎదురుచూడటం
బ్రతిమలాడి తను అలక తీర్చడం
పూట పూట ఎన్నెన్ని చిలిపి కలహాలు
జంటలెన్ని చెబుతున్నా
ఎన్ని కథలు వింటున్నా
అంతుబట్టదే ప్రేమ ఏనాటికైనా
విన్నాగాని అంటావేగాని
ఏమంటోంది ఆకాశవాణి
చూసాగాని వేరే లోకాన్ని
ఏంచెప్పాలి చూపించే వీలులేదని
చరణం 2
పక్కకెళ్ళిపో పాడు మౌనమా
కరగవెందుకే కొద్ది దూరమా
బయటపడని జత ఏదో చూసుకోరాదా
ఎంతసేపు ఈ వింత dilemma
కథని కాస్త కదిలించు కాలమా
to be not to be debate ఎంతకీ తెగదా
కొత్త దారిలో నడక
ఇప్పుడిప్పుడే గనక
తప్పదేమో తడబడక
అలవాటు లేక
ఇన్నాళ్ళుగా ఉన్నాగా నేను
నువ్వొచ్చాక ఏమైపోయాను
నీతో ఇలా అడుగేస్తున్నాను
ఏవైపంటే ఏమో ఎలాగ చెప్పను