సినిమాపేరు : గమ్యం || సంగీత దర్శకుడు : హేశం అబ్దుల్ వాహబ్ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : సుజాత
పల్లవి :
సమయమా చలించకే బిడియమా తలొంచకే
తీరం ఇలా తనకు తానే వెతికి జతకి చేరే క్షణాలలో
సమయమా చలించకే బిడియమా తలొంచకే
చరణం 1
చంటి పాపలా అనుకుంటూ ఉండగానే
చందమామలా కనుగొన్నా గుండెలోనే
తనలో చిలిపితనం సిరివెన్నెలే అయ్యేలా
ఇదిగో కలల వనం అని చూపుతున్న లీలలో
సమయమా చలించకే బిడియమా తలొంచకే
చరణం 2
పైడి బొమ్మలా నను చూసే కళ్ళలోనే
ఆడ జన్మలా నను గుర్తించాను నేనే
తనకే తెలియదని నడకంటే నేర్పుతూనే
నను నీ వెంటే రానీ అని వేడుతున్న వేళలో
సమయమా చలించకే బిడియమా తలొంచకే