సినిమాపేరు : సిరివెన్నెల || సంగీత దర్శకుడు : మహదేవన్ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : సుశీల
పల్లవి :
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే
చరణం1
చలువ చందనములు పూయ చందమామ రావే
జాజిపూలతావినీయ జాబిల్లి రావే
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే
గగనపు విరితోటలోని గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చరణం2
మునిజన మానస మోహిని యోగిని బృందావనం
మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం
రాధామాధవ గాధల రంజిల్లు బృందావనం
గోపాలుని మృదుపద మంజీరము బృందావనం
బృందావనం బృందావనం
హే కృష్ణా మురారి
జయ కృష్ణా మురారి
జయ జయ కృష్ణా మురారి
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే