సినిమాపేరు : నువ్వే నువ్వే || సంగీత దర్శకుడు : కోటి | గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : శంకర్ మహదేవన్
పల్లవి:
చెలియా నీవైపే వస్తున్నా
కంట పడవా ఇకనైనా ఎక్కడున్నా
నిద్దర పోతున్న రాతిరినడిగా
గూటికి చేరిన గువ్వలనడిగా
చల్లగాలినడిగా ఆ చందమామనడిగా
ప్రియురాలి జాడ చెప్పరేమని
అందరినీ ఇలా వెంట పడి అడగాలా
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా
చరణం1
అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం
అరెరే పాపమని జాలిగా చూసే జనం
గోరంత గొడవ జరిగితె కొండంత కోపమా
నన్నొదిలి నువ్వు ఉండగలవ నిజం చెప్పవమ్మా
చరణం2
నువ్వు నా ప్రాణం అని విన్నవించు ఈ పాటని
ఎక్కడో దూరానున్న చుక్కలే విన్నాగాని
కదిలించలేద కాస్త కూడ నీ మనస్సుని
పరదాలు దాటి ఒక్కసారి పలకరిచవేమే
చెలియా నీవైపే వస్తున్నా
కంట పడవా ఇకనైనా ఎక్కడున్నా
నిద్దర పోతున్న రాతిరినడిగా
గూటికి చేరిన గువ్వలనడిగా
చల్లగాలినడిగా ఆ చందమామనడిగా
ప్రియురాలి జాడ చెప్పరేమని
అందరినీ ఇలా వెంట పడి అడగాలా
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా