-1.1 C
New York
Saturday, December 13, 2025
spot_img

CHEPPAVE CHIRUGALI FULL SONG WITH LYRICS IN TELUGU – SIRIVENNELA SEETHARAMA SASTHRY || OKKADU SONGS

 ఆశ దీపికలై మెరిసే తారకలు

చూసే తీపి కలై విరిసే కోరికలు

 మనతో జతై సాగుతుంటే

హో అడుగే అలై పొంగుతుంది

  చుట్టూ ఇంకా రేయున్నా

 అంతా కాంతే చూస్తున్నా

ఎక్కడ ఎక్కడ ఎక్కడ వేకువ అంటూ

రెక్కలు విప్పుకు ఎగిరే కళ్ళు

దిక్కులు తెంచుకు దూసుకుపోతూ ఉంటె

 ఆపగలవ చీకట్లు

కురిసే సుగంధాల హోలీ

చూపదా వసంతాల కేళి

కురిసే సుగంధాల హోలీ

చూపదా వసంతాల కేళి

 చెప్పవే చిరుగాలి

చల్లగా ఎద గిల్లి

యమునా తీరాలా కథ వినిపించేలా

రాధామాధవుల జత కనిపించేలా

పాడనీ వెన్నెల్లో వేళా

చెవిలో సన్నాయి రాగంలా

కలలే నిజమై అందేలా

 ఊగే ఊహల ఉయ్యాల

లాహిరి లాహిరి లాహిరి తారంగాల

 రాతిరి యేటిని ఈదే వేళా

జాజిరి జాజిరి జాజిరి జానపదంలా

 పొద్దే పలకరించాలి

 ఊపిరే ఉల్లాసంగా తుళ్ళీ

హో చూపదా వసంతాల కేళి

 ఊపిరే ఉల్లాసంగా తుళ్ళీ

హో చూపదా వసంతాల కేళి

Related Articles

Stay Connected

28,000FansLike
11,000FollowersFollow
5,002FollowersFollow

Latest Articles