సినిమాపేరు : మహానటి || సంగీత దర్శకుడు : మీకీ జె మేరు || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు :సునీత
పల్లవి:
అనగా అనగా మొదలై కధగా
అటుగా ఇటుగా నదులై కదులు
అప్పుడో ఇప్పుడో దరి చేరునుగా
కదలి ఊడా కదా తేరునుగా
గడిచే కాలాన గతమేదైనా
స్మృతి మాత్రమే కదా
చివరకు మిగిలేది..
చివరకు మిగిలేది..
చివరకు మిగిలేది..
చివరకు మిగిలేది..
చరణం1
ఎవరు ఎవరు ఎవరు నువ్వంటే
నీవు ధరించిన పాత్రలు అంతే
నీడని పిలిచే బ్రతుకేదంటే
తెరపై కదిలే చిత్రమే అంతే
ఈ జగమంత నీ నర్తనశాలై
చెపుతున్న నీ కధే
చివరకు మిగిలేది విన్నవా మహానటి
చెరగని చేవ్రాలిది నీదేనే మహానటి
చివరకు మిగిలేది విన్నావా మహానటి
మా చెంపల మీదుగా ప్రవహించే మహానది