సినిమాపేరు : మహానటి || సంగీత దర్శకుడు : మీకీ జె మేరు || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు :అనురాగ్ కులకర్ణి
పల్లవి:
అభినేత్రి ఓ అభినేత్రి
అభినేత్రి నటగాయత్రి
మనసారా నిను కీర్తించి
పులకించినది ఈ జనధాత్రి
నిండుగ ఉందిలే దుర్గ దీవెనం
ఉందిలే జన్మకో దైవ కారనం
నువ్వుగా వెలిగే ప్రతిభాగుణం
ఆ నటరాజుకు స్త్రీరూపం
కలకే అంకితం నీ కణకణం
వెండి తెరకెన్నడో వుందిలే రుణం
పేరుతో పాటుగా అమ్మనే పదం
నీకే దొరికిన సౌభాగ్యం
మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి
చరణం1
కళను వలచావు కలను గెలిచావు
కడలికెదురీది కధగ నిలిచావు
భాష యేదైనా యెదిగి ఒదిగావు
చరిత పుటలోన వెలుగు పొదిగావు
పెనుశిఖరాగ్రమై గగనాలపై నిలిపావుగ అడుగు
నీ ముఖచిత్రమై నలుచెరగుల
తల యెత్తినది మన తెలుగు
మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి