సినిమా పేరు: శుభ సంకల్పం || సంగీత దర్శకుడు : కీరవాణి || గీత రచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రి || గాయకుడు : ఎస్.పీ.బాలు
పల్లవి:
శ్రీశైలంలో మల్లన్న
సింహాద్రిలో అప్పన్న
తిరపతిలో ఎంకన్న
బధ్రగిరిలో రామన్న
ఆ దేవుళ్ళందరి కలబోత
అయ్యా సామీ నువ్వేనంటా
చరణం1
దండాలయ్య సామికి
దండలు వేయరా సామికి
దాసుల గాచే సామికి దండకాలు(దండాలయ్య)
కొండంతా అండల్లే కొలువైన
మా రేడు కొంగు బంగారైనాడు
ఈ దొర….ఓ…మా దొర….ఓ…
చరణం2
సిరులిచ్చే సంద్రమంటే
దైవం మా దొరకి
సెమటొచ్చే వాడంటే ప్రాణం
మా సామికి
మచ్చలేని మనిషిరా
మచ్చరమే లేదురా
ఎదురు లేని నేతరా ఎదురులేని నేతరా
చేతికెముకలేని దాతరా
ఎదలో నిలుపుకుంటే
ఒదిగిపోవు దేవరా
శ్రీశైలంలో మల్లన్న
సింహాద్రిలో అప్పన్న
తిరపతిలో ఎంకన్న
బధ్రగిరిలో రామన్న
ఆ దేవుళ్ళందరి కలబోత
అయ్యా సామీ నువ్వేనంటా