సినిమా పేరు: శుభ సంకల్పం || సంగీత దర్శకుడు : కీరవాణి || గీత రచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రి || గాయకుడు : ఎస్.పీ.బాలు
పల్లవి:
చిరంజీవి.. సౌభాగ్యవతి.. గంగా మహాలక్ష్మికి..
ఊరు.. మమతలూరు..
తాలూకా.. ఊహాపురం..
జిల్లా.. అనంతగిరి..
చరణం1
ఎవరు ఇచ్చారమ్మా ఇన్నక్షరాలు..
అక్షరాల యెనక ఎన్ని అర్ధాలు..
ఏ దేవత ఇచ్చిందో ఇన్ని వరాలూ..
విప్పి నేను చెప్పలేను ఆ వివరాలు..
చరణం2
అక్షరాలా కావవి ఆమ్మోరి అక్షితలూ..
మరు జన్మకివి నీకు మాలక్ష్మి సేజలు..
గుడిలోని దేవత నడచి పోతావుంటే..
గుడిలోని దేవత నడచి పోతావుంటే..
అడుగడుగూ దండాలు పాదాలకీ…..
పసిడి పాదాలకి.. పసుపు వేదాలకీ…..
చిరంజీవి.. సౌభాగ్యవతి.. గంగా మహాలక్ష్మికి..
ఊరు.. మమతలూరు..
తాలూకా.. ఊహాపురం..
జిల్లా.. అనంతగిరి..