సినిమాపేరు : ముకుంద|| సంగీత దర్శకుడు : మిక్కీ. జె. మేయర్ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : కె. ఎస్. చిత్ర
పల్లవి :
గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదర
గోపికమ్మా నిను విడనీమ్మా మంచు తెర
విరిసిన పూమాలగా | వెన్నుని ఎద వాలగా | తలపును లేపాలిగా బాలా…
పరదాలే తీయక | పరుపే దిగనీయక | పవళింపా ఇంతగా లేరా…
కడవల్లో కవ్వాలు సడి చేస్తున్నా వినక
గడపల్లో కిరణాలు లేలెమన్నా కదలక
కలికి ఈ కునుకేల తెల్లవార వచ్చెనమ్మ
గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదర
గోపికమ్మా నిను విడనీమ్మా మంచు తెర
చరణం :
నీ కలలన్నీ | కల్లలై రాతిరిలో కరగవని
నువ్వు నమ్మేలా | ఎదురుగా నిలిచెనే కన్యామణి
నీ కోసమని | గగనమే భువి పైకి దిగి వచ్చెనని
ఆ రూపాన్ని | చూపుతో అల్లుకుపో సౌదామిని
జంకేల జాగేల | సంకోచాల జవ్వని
బింకాలు బిడియాలు | ఆ నల్లనయ్య చేత చిక్కి
పిల్లనగ్రోవై ప్రియమార | నవ రాగాలే పాడని
అంటూ ఈ చిరుగాలి | నిను మేలుకొలుపు సంబరాన
గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదర
గోపికమ్మా నిను విడనీమ్మా మంచు తెర
చరణం :
ఏడే అల్లరి వనమాలి | నను వీడే మనసున దయ మాలి
నంద కుమారుడు | మురళీలోలుడు | నా గోపాలుడు ఏడే ఏడే
లీలా కృష్ణ | కొలనులో కమలములా కన్నె మది
తనలో తృష్ణ | తేనెలా విందిస్తానంటున్నది
అల్లరి కన్న | దోచుకో కమ్మని ఆశల వెన్న ఇది
అందరి కన్నా | ముందుగా తన వైపే రమ్మన్నది
విన్నావా చిన్నారి | ఏమందో ప్రతి గోపిక
చూస్తూనే చేజారే | ఈ మంచి వేళ మించనీక
త్వరపడవమ్మా సుకుమారి | ఏమాత్రం ఏమారక
వదిలావో వయ్యారి | బృందావిహారి దొరకడమ్మ
గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదర
గోపికమ్మా నిను విడనీమ్మా మంచు తెర
గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదర
గోపికమ్మా నిను విడనీమ్మా మంచు తెర