సినిమాపేరు : అజ్ఞాతవాసి || సంగీత దర్శకుడు : అనిరుద్ రవి చంద్రన్ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : అనిరుద్ రవి చంద్రన్
పల్లవి :
గాలి వాలుగా…
ఓ గులాబీ వాలి…
గాయం అయినదీ
నా గుండె కి తగిలి..
తపించిపోనా
ప్రతిక్షణం ఇలాగ నీకోసం
దరించిపోనా
చెలి ఇలా దొరికితే ని స్నేహం
చరణం :
ఎం చేసావే
మబ్బులను పువ్వుల్లో తడిపి
తేన జడిలో ముంచేసావే
గాలులకు గంధం రాసి పైకి విసురుతావే
ఎం చేస్తావే మెరుపు చురకత్తులనే దూసి
పడుచు ఎదలో దించేసావే
తలపునే తునకలు చేసి
తపన పెంచుతావే
నడిచే హరివిల్లా
నను నువ్విలా మురిపెడుతుంటే ఎలా
అణువణువునా విల విలమనదా
నా ప్రాణం నిలువెల్లా
నిలు నిలు నిలబడు పిల్లా
గాలిపటంలా ఎగరకే అల్లా
సుకుమారి సొగసులు
అలా ఒంటరిగా వదలాలా…
చూస్తానే గాలి వాలుగా…
ఓ గులాబీ వాలి…
గాయం అయినదీ
నా గుండె కి తగిలి..
తపించిపోనా
ప్రతిక్షణం ఇలాగ నీకోసం
దరించిపోనా
చెలి ఇలా దొరికితే ని స్నేహం
కోర కోర కోపమేల
చరణం :
చుర చుర చూపులేల
మనోహరి మాడిపోనా అంత ఉడికిస్తే
అరె అని జాలి పడవే పాపం కదే ప్రేయసి
సరే అని చల్లపడవే మోసి పిశాచి
ఉహు అలా తిప్పుకుంటూ తూలిపోకే ఊర్వశి
అహో అలా నవ్వుతావే మీసం మెలేసి
ఎన్నాలింకా ఊరికే ఊహల్లో
ఉంటావ్ పెంకీ పిల్లా
చాల్లే ఇంక మానుకో
ముందు వెనుక చూసుకొని పంతం
ఆలోచిద్దాం
చక్కగా కూర్చొని చర్చిద్దాం
చాలు యుద్ధం రాజీకొద్దాం
కొద్దిగా కలిసొస్తే నీకేమితంట కష్టం
నడిచే హరివిల్లా
నను నువ్విలా మురిపెడుతుంటే ఎలా
అణువణువునా విల విలమనదా
నా ప్రాణం నిలువెల్లా
నిలు నిలు నిలబడు పిల్లా
గాలిపటంలా ఎగరకే అల్లా
సుకుమారి సొగసులు
అలా ఒంటరిగా వదలాలా…
ఎం చేయాలో లే
గాలి వాలుగా…
ఓ గులాబీ వాలి…
గాయం అయినదీ
నా గుండె కి తగిలి..
తపించిపోనా
ప్రతిక్షణం ఇలాగ నీకోసం
దరించిపోనా
చెలి ఇలా దొరికితే ని స్నేహం