సినిమాపేరు : క్షణ క్షణం || సంగీత దర్శకుడు : ఎం .ఎం .కీరవాణి || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : కే.ఎస్ .చిత్ర ,ఎస్.పి.బాలసుబ్రమణ్యం
పల్లవి :
జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా
జోరు గాలిలో జాజికొమ్మ జారనీయకే కలా
వయ్యారి వాలు కళ్ళలోన వరాల వెండి పూల వాన
స్వరాల ఊయలూగు వేళ
జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా
చరణం 1
కుహు కుహు సరాగాలె శృతులుగా కుశలమా అనే స్నేహం పిలువగా
కిల కిల సమీపించే సడులతో ప్రతి పొద పదాలేవో పలుకగా
కునుకు రాక బుట్ట బొమ్మ గుబులు గుందని
వనము లేచి వద్ద కొచ్చి నిద్ర పుచ్చని
జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా
చరణం 2
మనసులో భయాలన్నీ మరిచిపో వగతలో మరో లోకం తెరుచుకో
కలలతో ఉష తీరం వెతుకుతూ నిదరతో నిశారానే నడిచిపో
చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి కరిగిపోక తప్పదమ్మా ఉదయ కాంతికి
జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా
జోరు గాలిలో జాజికొమ్మ జారనీయకే కలా
వయ్యారి వాలు కళ్ళలోన మ్మ్ హ్మ్మ్ మ్మ్ హ్మ్మ్ హా హ
స్వరాల ఊయలూగు వేళ హహ హహహ తాన నాన
మ్మ్ హ్మ్మ్ హ్మ్మ్ ఆహ్ హ తానతననన తాని నాన మ్మ్మ్మ్మ్ అః మ్మ్ మ్మ్ మ్మ్ అః