0.1 C
New York
Saturday, December 7, 2024
spot_img

ENTHAVARAKU SONG LYRICS IN TELUGU

 ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు

గమనమే నీ గమ్యమైతే బాటలో నీ బ్రతుకు దొరుకు

ప్రశ్నలో నీ బదులు వుందే గుర్తు పట్టే గుండె నడుగు

 కనపడే ఎన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రం అంటారు

అడగరు ఒకొక్క అల పేరు ఊఊఉ

 మనకేల ఎదురైనా ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు

పలికారు మనిషి అంటే ఎవరూ ఊఊఉ

 సరిగా చూస్తున్నాడా నీ మది గదిలో నువ్వే కదా వున్నది

చుట్టూ అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది

 నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో లేదా

 మన్ను మిన్ను నీరు అన్ని కలిపితే నువ్వే కాదా కాదా

 ప్రపంచం నీలో వున్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా

తెలిస్తే ప్రతిచోటా నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా

మనసులో నీవైనా భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలే

నీడలు నిజాల సాక్ష్యాలే ఏ

శత్రువులు నీలోని లోపాలే స్నేహితులు నీకున్న ఇష్టాలే

 రుతువులు నీ భావ చిత్రాలే ఏ

ఎదురైనా మందహాసం నీలోని చెలిమి కోసం

మోసం రోషం ద్వేషం నీ మైథిలి మదికి భాష్యం

 పుట్టుక చావు రెండే రెండు నీకవి సొంతం కావు పోనీ

 జీవితకాలం నీదే నేస్తం రంగులు ఎం వేస్తావో కానీ

 తారరరరె తారరరరె తారరరరె తారారారే

తారరరరె తారరరరె తారరరరె తారారారే

 తారరరరె తారరరరె తారరరరె తారారారే

Related Articles

Stay Connected

20,000FansLike
3,999FollowersFollow
4,762FollowersFollow

Latest Articles