సినిమాపేరు : స్వర్ణకమలం || సంగీత దర్శకుడు : ఇళయరాజా | గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : ఎస్. పి. బాలసుభ్రమణ్యం
పల్లవి:
కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకి
మెత్తగా రేకు విచ్చెనా
మెత్తగా రేకు విచ్చెనా
కొమ్మ చాటునున్న కన్నెమల్లికి
కొమ్మ చాటునున్న కన్నెమల్లికి
కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా
కొండగాలి మార్చింది కొంటె వాగు జోరు
కులుకులెన్నో నేర్చింది కలికి ఏటినీరు
బండరాల హోరు మారి పంటచేల పాటలూరి
మేఘాల రాగాల మాగాణి ఊగేల
సిరిచిందులేసింది కనువిందు చేసింది
చరణం1
కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా
వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి
ఎదురులేక ఎదిగింది మధురగానకేళి
భాషలోన రాయలేని రాసలీల రేయిలోని
యమునాతరంగాల కమనీయ శృంగార కళలెన్నో చూపింది కలలెన్నో రేపింది
చరణం2