సినిమాపేరు : ఇందిరా || సంగీత దర్శకుడు : ఏ.ఆర్ .రెహమాన్ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : హరిణి
పల్లవి :
లాలీ లాలి అనురాగం సాగుతుంటే ఎవరూ నిదురపోరే
చిన్న పోదా మరీ చిన్న ప్రాణం
కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుటపడదే
అంతచేదా మరీ వేణుగానం
కళ్ళుమేలుకుంటే కాలం ఆగుతుందా భారమైన మనసా…ఆ
పగటి బాధలన్నీ మరిచిపోవుటకు ఉంది కదా ఈ ఏకాంతం వేళా

చరణం1
ఎటో పోతుంది నీలిమేఘం వర్షం మెరిసిపోదా
ఏదో అంటుంది కోయిల శోకం రాగం మూగపోగా
అన్నీ వైపులా మధువనం మధువనం ఎండిపోయెనే ఈ క్షణం
అణువణువునా జీవితం అడియాసకే అంకితం
చరణం2