సినిమాపేరు : మహానటి || సంగీత దర్శకుడు : మీకీ జె మేరు || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : అనురాగ్ కులకర్ణి,శ్రేయ గోషాల్
పల్లవి:
మూగ మనసులు, మూగ మనసులు
మన్ను మిన్ను కలసుకున్న సీమలో
నన్ను నిన్ను కలుపుతున్న ప్రేమలో
జగతి అంటే మనమే అన్న మాయలో
సమయం అన్న జాడ లేని హాయి లో
ఆయువే గేయమై స్వాగతించగా
తరలి రావటే చైత్రమా
కుహూ కుహూ కుహూ
స్వరాల ఊయలూగుతున కోయిలైన వేళ
మూగ మనసులు, మూగ మనసులు
చరణం1
ఊహల రూపమా ఊపిరి దీపమా
నా చిరునవ్వుల వరమా
గాలి సరాగమా పూల పరాగమా
నా గత జన్మల రుణమా
చరణం2
ఊసులు బాసలు ఏకమైన శ్వాసలో
నిన్నలు రేపులు లీనమైన నేటిలో
ఈ నిజం కదా అని తరతరాలు చదవనీ
ఈ కధే నిజమని కలల లోనే గడపనీ
వేరే లోకం చేరే వేగం పెంచే మైకం
మననిలా తరమనీ
తారాతీరాం తాకే దూరం
ఎంతో ఏమో అడగకే ఎవరనీ
మూగ మనసులు, మూగ మనసులు