సినిమాపేరు : గులాబీ || సంగీత దర్శకుడు : శశి ప్రీతమ్ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : నాగూర్ బాబు,గాయత్రీ
పల్లవి:
మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా రేగిపొమ్మన్నది
అమ్మాయితో సాగుతూ చిలిపి మది
beat in my heart ఎందుకింత కొట్టుకుంది
heat in my thought వెంటపడి చుట్టుకుంది
oh my God ఏమిటింత కొత్తగున్నది
చరణం1
హల్లో పిల్ల అంటూ ఆకతాయి ఆనందాలు
ఆలాపిస్తూ వుంటే స్వాగతాల సంగీతాలు
ఆడగా నెమలి తీరుగా మనసు ఝల్ ఝల్ ఝల్లుమని
ఆకాశాన్నే హద్దు పావురాయి పాపాయికి
ఆగే మాటే వద్దు అందమైన అల్లరి
మారదా వరద హోరుగా
వయసు ఝల్ ఝల్ ఝల్లుమని
ఓం నమః వచ్చి పడు ఊహలకు
ఓం నమః కళ్ళు వీడు ఆశలకు
ఓం నమః ఇష్టమైన అలజడికీ
చరణం2
మెచ్చినట్టే వుంది రెచ్చిపోయి పిచ్చి స్పీడు
వద్దంటున్నా విందే చెంగుమంటూ చిందే ఈడు
గువ్వలా రివ్వు రివ్వున యవ్వనం ఎటు పోతుంది
కట్టలేక ఈడు నన్ను మెచ్చుకుంది నేడు
పందెం వేస్తా చూడు పట్టలేరు నన్నెవ్వడు
అంతగా బెదురు ఎందుకు
మనకు ఎదురింకేముంది
నీ తరహా కొంప ముంచేటట్టే వుంది
నా సలహా ఆలపిస్తే safety వుంది
ఏంటి మహా అంత జోరు కాస్త నెమ్మది
మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా రేగిపొమ్మన్నది
అమ్మాయితో సాగుతూ చిలిపి మది
beat in my heart ఎందుకింత కొట్టుకుంది
heat in my thought వెంటపడి చుట్టుకుంది
oh my God ఏమిటింత కొత్తగున్నది