-5.3 C
New York
Saturday, January 25, 2025
spot_img

MEGHALLO FULL SONG WITH LYRICS IN TELUGU || SEETHAMMA VAAKITLO SIRIMALLE CHETTU SONGS

ఇంతవరకెన్నో చూశాం అనుకుంటే సరిపోదుగా
ఎంత బరువంటే మోసే దాకా తెలియదుగా
ఇంతమందున్నాంలే అనిపించే బింకం చాటుగా కాస్తైన కంగారు ఉంటుందిగా
నీకైతే సహజం తీయని బరువై సొగసించే బిడియం
పనులెన్నో పెట్టి మాటలలో వచ్చిందే ఈ సమయం
మగాళ్లమైనా ఏం చేస్తాం సంతోషంగా మోస్తాం
ఘనవిజయం పొందాకే తీరిగ్గా గర్విస్తాం
అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చందురిని
వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓ రమణి

రామచిలకలతో చెప్పి రాయించామే పత్రిక
రాజహంసలతో పంపి ఆహ్వానించాంగా
కుదురుగా నిమిషం కూడా నిలబడలేమే బొత్తిగా
ఏమాత్రం ఏచోట రాజీ పడలేక
చుట్టాలందరికీ ఆనందంతో కళ్లు చమర్చేలా
గిట్టని వాళ్లైనా ఆశ్చర్యంతో కన్నులు విచ్చేలా
కలల్లోనైనా కన్నామా కథలైనా విన్నామా
ఈ వైభోగం అపురూపం అనుకుంటారమ్మా
అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చందురిని
వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓ రమణి

Related Articles

Stay Connected

20,000FansLike
3,999FollowersFollow
4,762FollowersFollow

Latest Articles