సినిమాపేరు : మన్మాడుదు || సంగీత దర్శకుడు :దేవి శ్రీ ప్రసాద్ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : చిత్ర ఎస్.పి .బాలసుబ్రమణ్యం
పల్లవి :
నా మనసునే మీటకే నేస్తమా
నా దారిలో చేరకే చైత్రమా
సరదాల చిలిపితనమా
చిరునవ్వులొని స్వరమా
నా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమా
నా మనసునే మీటకే నేస్తమా
నా దారిలో చేరకే చైత్రమా
చరణం1
నాకెందుకిలా ఔతోంది చెప్పవా ఒక్క సారి
నీ వెంటపడే ఆశలకే చూపవా పూల దారి
చినుకల్లే చేరి వరదల్లే మారి ముంచేస్తే తేలేదెలాగా
తడిజాడ లేని తమ గుండెలోని దాహాలు తీరేదెలాగా
లేనిపోని సయ్యాటతో వెంటాడకే ప్రేమా
నీ కనులలో వెలగనీ ప్రియతమా
నీ పెదవికే తెలుపనీ మధురిమా
చరణం2
నీ ఊహలలో కొంటెతనం పలకరిస్తోంది నన్ను
నీ ఊపిరితో అల్లుకుని పులకరిస్తోంది వెన్ను
అలవాటు పడిన ఎద చీకటింట సరికొత్త వేకువై రావా
కిరణాలు పడని తెరచాటులోని ఏకాంతమే వదులుకోవా
నన్ను నేను మరిచేంతల మురిపించకే ప్రేమా
నీ కనులలో వెలగనీ ప్రియతమా
నీ పెదవికే తెలుపనీ మధురిమా
సరదాల చిలిపితనమా
చిరునవ్వులొని స్వరమా
నా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమా
నా మనసునే మీటకే నేస్తమా
నా దారిలో చేరకే చైత్రమా