సినిమాపేరు : లిటిల్ సోల్జర్స్ || సంగీత దర్శకుడు : శ్రీ కొమ్మినేని || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : శ్రీ లేఖ ,విష్ణుకాంత్,చక్రవారహై
పల్లవి:
ఓ … వెండి వెన్నెలా ..
ఓ … దిగిరా ఇలా ..
అమ్మ కొంగులో చంటిపాపలా
మబ్బు చాటునే ఉంటే ఎలా
పడిపోతాననీ పసి పాదాలకీ పరుగే నేర్పవా
మదిలో దాగినా మధుభావాలకి వెలుగే చూపవా
మనసుంటే మార్గముంది తెంచుకోవే సంకెలా
చరణం1
ఓ .. సుప్రభాతమా ..
ఓ .. శుభమంత్రమా ..
మేలుకొమ్మనే ప్రేమ గీతమా
చేరుకున్ననా తొలి చైత్రమా
నీ స్వరాలతో నా నరాలలో ఒక గంగా నది
ఈ క్షణాలని జత చేరాలని
అలలౌతున్నది
వెల్లువలా చేరుకోన వేచి ఉన్న సంద్రమా
చరణం2
అంత దూరమా స్వర్గమన్నదీ
చిటికెలో ఇలా మనదైనది
అందరానిదా స్వప్నమన్నదీ
అందమైన ఈ నిజమైనది
చిరుహాసానికి మా సంసారమే చిరునామా అని
ఈ సంతోషమే మా సంతానమై చిగురించాలని
ప్రతి రొజూ పండుగల్లె సాగుతోంది జీవితం
ఓ … వెండి వెన్నెలా ..
ఓ … దిగిరా ఇలా ..
అమ్మ కొంగులో చంటిపాపలా
మబ్బు చాటునే ఉంటే ఎలా
పడిపోతాననీ పసి పాదాలకీ పరుగే నేర్పవా
మదిలో దాగినా మధుభావాలకి వెలుగే చూపవా
మనసుంటే మార్గముంది తెంచుకోవే సంకెలా