సినిమాపేరు : నువ్వు నాకు నచ్చావు || సంగీత దర్శకుడు : కోటి | గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : కుమార్ సను
పల్లవి:
ఒక్క సారి చెప్పలేవా నువ్వు నచ్చావని
చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని
మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత
ఒదిగుండమనక వదిలేయమంటు బతిమాలుకున్న వేళ
వెన్నెలేదో వేకువేదో నీకు తెలుసా మరి
నిదురపోయే మదిని గిల్లి ఎందుకా అల్లరి
చరణం1
చందమామ మనకందదని ముందుగానె అది తెలుసుకుని
చేయిజాచి పిలవద్దు అని చంటిపాపలకు చెబుతామా
లేనిపోని కలలెందుకని మేలుకుంటె అవి రావు అని
జన్మలోనె నిదరోకు అని కంటిపాపలకు చెబుతామా
కలలన్నవి కలలని నమ్మనని
అవి కలవని పిలవకు కలవమని
మది మీటుతున్న మధురానుభూతి మననడిగి చేరుతుందా
చరణం2
అందమైన హరివిల్లులతో వంతెనేసి చిరుజల్లులతో
చుక్కలన్ని దిగి వస్తుంటే కరిగిపోని దూరం ఉందా
అంతులేని తన అల్లరితో అలుపులేని తన అలజడితో
కెరటమెగిరి పడుతూ ఉంటే ఆకాశం తెగి పడుతుందా
మనసుంటే మార్గం ఉంది కద అనుకుంటే అందనిదుంటుందా
అనుకున్నవన్ని మనకందినట్టే అనుకుంటే తీరిపోదా
ఒక్క సారి చెప్పలేవా నువ్వు నచ్చావని
చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని
మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత
ఒదిగుండమనక వదిలేయమంటు బతిమాలుకున్న వేళ
వెన్నెలేదో వేకువేదో నీకు తెలుసా మరి
నిదురపోయే మదిని గిల్లి ఎందుకా అల్లరి