సినిమాపేరు : కంచె || సంగీత దర్శకుడు :చిఱన్తాన్ భట్ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : శంకర్ మహదేవన్
పల్లవి:
ఊరు ఏరయ్యింది ఏరు హోరెత్తింది
ఎత్తి కోటా పేట ఏకం చేస్తూ చిందాడింది
ఊరు ఏరయ్యింది ఏరు హోరెత్తింది
ఎత్తి కోటా పేట ఏకం చేస్తూ చిందాడింది
భేరీలు బూరాలు తప్పెట్లు తాళాలు
హోరెత్తే కోలాహాలంలో
ఈ ఏడు లోకాలు ఏలేటి వాడేరా
ఊరేగి రావయ్యా మా వాడకీవాళ
పెద్దోళ్ళు పేదోళ్ళు అయినోల్లే అవ్వాల
కానోళ్ళ దే మాట లేకుండా పోవాల
తోబుట్టువింటికి సారెత్తుకెళ్ళి
సాకెట్టు కొచ్చావా మా గడపకి
మాలక్ష్మి మగడా ఏమిచ్చి పంపాల
మీరిచ్చిందేగా మాకున్నది
చరణం1
కదిలేటి రధచక్రమేమన్నదంటా
కొడవళ్ళు నాగళ్ళు చేసేపనంత
భూదేవి పూజే కదా
ఈ వేదమైనా ఎవరి స్వేదమైన
ఆ స్వామి సేవే కదా
కడుపారా ఈ మన్ను కన్నొల్లే అంత
కులమొచ్చి కాదంటాదా
ప్రతి ఇంటి పెళ్ళంటిదే వేడుక
జనమంతా చుట్టాలే కదా
ఈ ఏడు లోకాలు ఏలేటి వాడేరా
ఊరేగి రావయ్యా మా వాడకీవాళ
పెద్దోళ్ళు పేదోళ్ళు అయినోల్లే అవ్వాల
కానోళ్ళ దే మాట లేకుండా పోవాల
చరణం2
వజ్రాల వడగళ్లు సిరిజల్లు కురవాలా
తారంగ వాడే ఈ కేరింతల్లోన
ఈ పంచకా పంచ కే కంచెలున్నా
జరపాల ఈ జాతర
వెయ్య దాటి శయ్యాటలియ్యాల
మా చెలిమి చాటించగా
ప్రతి పల్లె ఈ సంబరం సాక్షిగా
మనలాగే ఉండాలనుకోదా
ఈ ఏడు లోకాలు ఏలేటి వాడేరా
ఊరేగి రావయ్యా మా వాడకీవాళ
పెద్దోళ్ళు పేదోళ్ళు అయినోల్లే అవ్వాల
కానోళ్ళ దే మాట లేకుండా పోవాల
ఊరు ఏరయ్యింది ఏరు హోరెత్తింది
ఎత్తి కోటా పేట ఏకం చేస్తూ చిందాడింది
ఊరు ఏరయ్యింది ఏరు హోరెత్తింది
ఎత్తి కోటా పేట ఏకం చేస్తూ చిందాడింది
భేరీలు బూరాలు తప్పెట్లు తాళాలు
హోరెత్తే కోలాహాలంలో