సినిమాపేరు : కంచె || సంగీత దర్శకుడు :చిఱన్తాన్ భట్ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : విజయ్ ప్రకాష్
పల్లవి
భగ భగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో
ధగా ధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో
ఏ పంటల రక్షణకే కంచెలా ముల్లు
ఏ బ్రతుకును పెంచుటకీ నెత్తుటి జల్లు
ఏ స్నేహం కోరవు కయ్యాల కక్షలు
ఏ దాహం తీర్చవు ఈ కారుచిచ్చులు
ప్రాణమే పనమై ఆడుతున్న జూదం
ఇవ్వదే ఎపుడు ఎవరికి ఎలాంటి గెలుపు
చావులో విజయం వెతుకు ఈ వినోదం
పొందదే ఎపుడు మేలుగొలుపు మేలుగొలుపు
అంతరాలు అంతమై అంత ఆనందమై
కలసి మలిసి మనగలిగే కాలం చెల్లిందా
చెలిమి చినుకు కరువై పగల సెగలు నెలవై
ఎల్లలతో పుడమి ఒళ్ళు నిలువెల్లా చీలిందా
చరణం1
నిశి నిషాద కరోన్ముక్త దురీత శరాగతం
మృదు-లాలస స్వప్నాలస హ్రుద్-కపోత పాదం
మృది వ్యధార్ధ పృథ్వి మాత నీర్గోశీత చేతం
నిష్టూర నిశ్వాసంతో నిశ్చేష్టిత గీతం
చరణం2
ఏ విష బీజోద్భూతం ఈ విషాద భుజం
ప్రాణమే పనమై ఆడుతున్న జూదం
ఇవ్వదే ఎపుడు ఎవరికి ఎలాంటి గెలుపు
చావులో విజయం వెతుకు ఈ వినోదం
పొందదే ఎపుడు మేలుగొలుపు మేలుగొలుపు
భగ భగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో
ధగా ధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో
భగ భగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో
ధగా ధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో