సినిమా పేరు: సిరి సిరి మువ్వా || సంగీత దర్శకుడు : కే.వీ.మహదేవన్ || గీత రచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రి || గాయకుడు : చిత్ర ,ఎస్.పీ.బాలు
పల్లవి:
స్వామి రారా
నా పాలి దిక్కు నీవేరా నీ పాదములంటి మ్రొక్కేరా
నీ దానరా రావేలరా నన్నేలరా
భరత శాస్త్ర సంభరిత పదద్వయ
చరిత నిరత సుమధుర మంగళ గళ రారా స్వామి రారా
రాగాలెన్నో పండిన గారాల నీ మెడలో అనురాగ మాలికలే వేయాలని
నీ చల్లని చరణాలు చల్లిన కిరణాలలో
రేపటి కోసం చీకటి రెప్పల తెర తీయాలని
పిలిచాను ఎదుట నిలిచాను కోరి కోరి నిన్నే వలచాను(2)
చరణం1
గంగ కదలి వస్తే కడలి ఎలా పొంగిందో
యమున సాగి వస్తే ఆ గంగ ఏమి పాడిందో
ఆమని వచ్చిన వేళ అవని ఎంత మురిసిందో
మోహన వేణువు తాకిన మోవి ఎలా మెరిసిందో
ఊగింది తనవు అలాగే పొంగింది మనసు నీలాగే
చరణం2
శృతి కలిసిందెన్నడో సిరిమువ్వల సవ్వడిలో
జత కలిసిందప్పుడే ఆ గుడిలో నీ ఒడిలో (2)
మువ్వనై పుట్టాలని అనుకున్నానొకనాడు (2)
దివ్వేనై నీ వెలుగులు రువ్వనీ ఈనాడు
పిలిచాను ఎదుట నిలిచాను
కోరి కోరి నిన్నే వలచాను