సినిమాపేరు : అష్ట చమ్మ || సంగీత దర్శకుడు : కళ్యాణి మాలిక్ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : శ్రీరామ చంద్ర
పల్లవి:
తిడతారా కొడతారా ఎవరైనా ఎపుడైనా
స్థిరం లేని ఈ శివాలెందుకని నిందిస్తారా బంధిస్తారా
హడావుడిగా పడి లేచే కడలి అలలే బలాదూరు తిరిగొచ్చే గాలి తెరలే
అదే పనిగా పరిగెత్తేదెందుకని అదిగో అలాగ అదుపే తెలీక ఉరికే కదం ఇది
ఎదలో ఇలాగ నదిహోరులాగా పలికే పదం ఇది
చరణం1
కృష్ణా ముకుందా మురారే నిష్టూరమైనా నిజం చెప్పమన్నారే
ఇష్టానుసారంగా పోనీరే సాష్టాంగపడి భక్తి సంకెళ్ళు కడతారే
నీ ఆలయాన గాలి అయినా ఈల వేసేనా హే కేళికైనా లీలకైనా వేళ కుదిరేనా
దేవుడిలాగ ఉంటే freedom అంత సులువా
ఆవారాగ నువ్వు ఆనందించగలవా ఉస్కో అంటు ఇంక ఉడాయించు మరి
అదిగో అలాగ అదుపే తెలీక ఉరికే కదం ఇది
ఎదలో ఇలాగ నదిహోరులాగా పలికే పదం ఇది
చరణం2
శ్రీరాముడంటుంటే అంతా శివతాండవం చేస్తే చెడిపోదా మరియాద
మతిమరుపు మితిమీరిపోకుండా అతిపొదుపు చూపాలి నవ్వైనా నడకైనా
ఈ ఫ్రేము దాటి పైకి వస్తే లోకువైపోవా
నీ పరువు నీదా పదవి నీదా ప్రజలదనుకోవా
చిరాగ్గుంటే మరీ ఈ పెద్దతరహా సరే అయితే విను ఇదో చిన్న సలహా
పరారైతే సరి మరోవైపు మరి అదిగో అలాగ అదుపే తెలీక ఉరికే కదం ఇది
ఎదలో ఇలాగ నదిహోరులాగా పలికే పదం ఇది
అదిగో అలాగ అదుపే తెలీక ఉరికే కదం ఇది
ఎదలో ఇలాగ నదిహోరులాగా పలికే పదం ఇది
అదిగో అలాగ అదుపే తెలీక ఉరికే కదం ఇది
ఎదలో ఇలాగ నదిహోరులాగా పలికే పదం ఇది