సినిమాపేరు : మహానటి || సంగీత దర్శకుడు : మీకీ జె మేరు || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : రమ్య బెహరా
పల్లవి:
ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యమా,
సరదా సిరిమువ్వాలవుదాం
చిటికెల తాళాలు వేద్దాం,
ఇంతలో వెళ్ళిపోకుమా
వెంట వచ్చే నేస్తమా
తొందరగా నన్నే పెంచేసి,
నువ్వేమో చినబోకుమా
చరణం1
ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యమా,
సరదా సిరిమువ్వాలవుదాం
యేటిలో వేగమా పాటలో రాగమా
వూరికే పనిలేక తీరిక అసలు లేక,
తోటలో తూనీగల్లే తిరిగొద్డామా ఎంచక్కా,
అంత పొడుగు ఎదిగాకా తెలుసుకోలేరింకా,
సులువుగా ఉడతల్లే చెట్టెకే ఆ చిట్కా,
నింగికి నిచ్చెనవెయ్యవే
చరణం2
గుప్పెడు చుక్కలు కొయ్యవే,
హారమల్లే రేపటి మెళ్ళో వెయ్యవే,
నీ పిలుపే అందే నలువైపులనుండి
అరచేతుల్లో వాలాలి.
నీ మది కోరిన కోరికలన్నీ
ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యమా,
సరదా సిరిమువ్వాలవుదాం
యేటిలో వేగమా పాటలో రాగమా