సినిమాపేరు : మహానటి || సంగీత దర్శకుడు : మీకీ జె మేరు || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : చారులత మని
పల్లవి:
తండ రంగా రంగా రంగా రన్న,
తండ రంగా రంగా రంగా రన్న
సదా నన్ను నడిపే నీ చెలిమే పూదరి నిలిచే
ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే
ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా …
అని నేడే తెలిసే
కాలం నర్తించగా నీతో జతై
ప్రాణం సుమించదా నీ కోసమై
కాలం నర్తించగా నీతో జతై
చరణం1
నదికి వరదల్లె మదికి పరవళ్ళై
బెరుకు ఎపుడు వదిలిందో
చురుకు ఎపుడు పెరిగిందో
తలపు తుది జళ్ళై
తనువు హరివిల్లై
వయసు ఎపుడు కదిలిందో
సొగసు ఎపుడు మెరిసిందో
గమనించెలోగా గామకించే రాగానా
ఏదో వీణ లోన మోగెనా
కాలం నర్తించగా నీతో జతై
ప్రాణం సుమించదా నీ కోసమై
కాలం నర్తించగా నీతో జతై