సినిమాపేరు : పట్టుదల || సంగీత దర్శకుడు :ఇళయరాజా || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : జానకి
పల్లవి:
అమావాస్య రేయి అలా ఆగిపోయి
ఉషాకాంతినే నిషేధించునా
నిషా నిదురలో సదా నిలుచునా
చరణం 1
ప్రపంచాన నీకన్నా దీనులెవరు లేరా
ప్రతీవారు నీకున్నా ప్రతిభ ఉన్న వారా
ఉలిని వలచి రాళ్ళైనా కళను తెలుసుకోవా
ఉనికి మరచి ఈ రత్నం వెలుగు విడచెనేల
వసంతాలు రావా సుగంధాలు తేవా
నిజం తెలుసుకోవా నిషావదులుకోవా
చరణం 2
జగాలేలు జాబిల్లి మహా ఒంటివాడు
తన అనే తోడేదీ సమీపాన లేదు
ఎదను రగులు వేడున్నా వెలిగి తెలియనీడు
జనులు నిదుర పోతున్నా అలిగి తొలగిపోడు
సుధాకాంతి పంచే విధిని మానుకోడు
యధాశక్తి చూపే కళను దాచుకోడు
అమావాస్య రేయి అలా ఆగిపోయి
ఉషాకాంతినే నిషేధించునా
నిషా నిదురలో సదా నిలుచునా