0.5 C
New York
Sunday, January 18, 2026
spot_img

RAA MUNDHADUGEDHAM FULL SONG WITH LYRICS IN TELUGU || KANCHE SONGS

రా ముందడుగేద్దాం
యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ
సరిహద్దుల్నే చెరిపే సంకల్పం అవుదాం

ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైనా
ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైనా
ఆయువు పోస్తుందా ఆయుధమేధైనా
రాకాసుల మూకల్లే మార్చదా పిడివాదం
రాబందు ల రెక్కల సడి ఏ జీవన వేదం
సాధించేదేముందీ ఈ వ్యర్ధ విరోధం
ఏ సస్యం పండించదు మరు భూముల సేద్యం
రేపటి శిశువుకు పట్టే ఆశల స్తన్యం
ఈ పూటే ఇంకదు అందాం
నేటి ధైన్యానికి ధైర్యం ఇద్దాం

రా ముందడుగేద్దాం
యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ
సరిహద్దుల్నే చెరిపే సంకల్పం అవుదాం

అందరికి సొంతం అందాల లోకం కొందరికే ఉందా పొందే అధికారం
మట్టి తోటి చుట్టరికం మరిపించే వైరం
గుర్తిస్తుందా మనిషికి మనిషితోటి బంధం
ఏ కళ్యాణం కోసం ఇంతటి కల్లోలం

Related Articles

Stay Connected

28,000FansLike
11,000FollowersFollow
5,002FollowersFollow

Latest Articles