సినిమాపేరు : ఆర్. ఆర్. ఆర్.|| సంగీత దర్శకుడు : యం. యం. కీరవాణి || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : యం. యం. కీరవాణి, హేమ చంద్ర
పల్లవి :
పులికి విలుకాడికి
తలకి ఉరితాడుకి
కదిలే కార్చిచ్చుకి
కసిరే పడగళ్ళకి
రవికి మేఘానికి…
దోస్తీ…. దోస్తీ…
ఊహించని చిత్ర విచిత్రం
స్నేహానికి చాచిన హస్తం
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో
ధరదంథాన దంధర దంధమ్
ధరదంథాన దంధర దంధమ్
ధరదంథాన దంధర దంధమ్
ధంధాన దందందం
చరణం :
పడపాటికి జడివానకి దోస్తీ
విధిరాతకి ఎదురీదని దోస్తీ
పెను జ్వాలకి హిమనగామిచ్చిన కౌగిలి ఈ దోస్తీ
ధరదంథాన దంధర దంధమ్
ధరదంథాన దంధర దంధమ్
ధరదంథాన దంధర దంధమ్
ధంధాన దందందం
చరణం :
అనుకోని గాలి దుమారం
చెరిపింది ఇరువురి దూరం
ఉంటారా ఇకపై ఇలాగ వైరమే భురివై
నడిచేది ఒకటే దారై
వెతికేది మాత్రం వేరై
తెగిపోదా ఎదో క్షణాన స్నేహమే ద్రోహమై
ఓ… తొందర పడి పడి ఉరుకలేత్తే ఉప్పెన పరుగుల హో
ముందుగా తెలియదు ఎదురు వచ్చే తప్పని మలుపులే హో
ఊహించని చిత్రవిచిత్రం
స్నేహానికి చాచిన హస్తం
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో
ధరదంథాన దంధర దంధమ్
ధరదంథాన దంధర దంధమ్
ధరదంథాన దంధర దంధమ్
ధంధాన దందందం
పడపాటికి జడివానకి దోస్తీ
విధిరాతకి ఎదురీదని దోస్తీ
పెను జ్వాలకి హిమనగామిచ్చిన కౌగిలి ఈ దోస్తీ
ధరదంథాన దంధర దంధమ్
ధరదంథాన దంధర దంధమ్
ధరదంథాన దంధర దంధమ్
ధంధాన దందందం
పడపాటికి జడివానకి దోస్తీ
విధిరాతకి ఎదురీదని దోస్తీ
పెను జ్వాలకి హిమనగామిచ్చిన కౌగిలి ఈ దోస్తీ