సినిమాపేరు : మహానటి || సంగీత దర్శకుడు : మీకీ జె మేరు || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : రమ్య బెహరా
పల్లవి:
గెలుపులేని సమరం
జరుపుతోంది సమయం
ముగించేదెలా ఈ రణం
మధురమైన గాయం
మరిచిపోదు హృదయం
ఇలా ఎంతకాలం.. భరించాలి ప్రాణం
గతంలో విహారం
కలల్లోని తీరం
అదంతా భ్రమంటే.. మనశ్శాంత మంటే
చరణం1
ఏవో జ్ఞాపకాలు
వెంటాడే క్షణాలు
దహిస్తుంటే దేహం.. వెతుక్కుందా మైకం
అలలుగా పదిలేచే.. కడలిని అడిగావా
తెలుసా తనకైనా.. తన కల్లోలం
ఆకాశం తాకే.. ఆశ తీరిందా
తీరని దాహం.. ఆగిందా
చరణం2
జరిగే మదనంలో.. విషమేదో రసమేదో
తేలేనా.. ఎప్పుడైనా ఎన్నాళ్ళైనా
పగలై సెగలై..
యెదలో ఆ రగిలె.. పగలూ రేయీ ఒకటై
నరనారాలలోనా.. విషమయిందీ ప్రేమా
చివరకు మిగిలేది..
ఇదే అయితే విధి రాత తప్పించ తరమా