సినిమా పేరు: శుభ సంకల్పం || సంగీత దర్శకుడు : కీరవాణి || గీత రచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రి || గాయకుడు : చిత్ర
పల్లవి:
హరి పాదాన పుట్టావంటే గంగమ్మ.. శ్రీ హరి పాదాన పుట్టావంటే గంగమ్మ..
ఆ హిమగిరిపై అడుగెట్టావంటే గంగమ్మా..
కడలే కౌగిలిని.. కరిగావంటే గంగమ్మా..
నీ రూపేదమ్మా.. నీ రంగేదమ్మా..
నీ రూపేదమ్మా.. నీ రంగేదమ్మా..
నడి సంద్రంలో నీ గడపేదమ్మా గంగమ్మా..
నీలాల కన్నుల్లో సంద్రమే హైలెస్సో.. నింగి నీలమంతా సంద్రమే హైలెస్సో..
నీలాల కన్నుల్లో సంద్రమే.. నింగి నీలమంతా సంద్రమే..