సినిమాపేరు : కొత్త బంగారు లోకం || సంగీత దర్శకుడు : మిక్కీ జె మేయర్ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : కళ్యాణి,నరేష్ ఐయ్యేరు
పల్లవి :
ఒకే అనేసా దేఖో నా భరోసా
నీకే వదిలేసా నాకెందుకులే రభసా
ఒకే అనేసా దేఖో నా భరోసా
నీకే వదిలేసా నాకెందుకులే రభసా
భారమంతా నేను మోస్తా అల్లుకోవా ఆశాలతో
చేరదీస్తా సేవచేస్తా రాణిలా చూస్తా
అందుకేగ గుండెలో నీ పేరు రాసా
తెలివనుకో తెగువనుకో మగజన్మ కదా
కథ మొదలనుకో తుది వరకు నిలబడగలదా
ఒకే అనేసా దేఖో నా భరోసా
నీకే వదిలేసా నాకెందుకులే రభసా
ఒకే అనేసా దేఖో నా భరోసా
నీకే వదిలేసా నాకెందుకులే రభసా
చరణం 1
పరిగెడదాం పదవే చెలి ఎందాక అన్నానా
కనిబెడదాం తుది మజిలీ ఎక్కడున్నాం
ఎగిరేడదాం ఇలనొదిలీ నిన్నగామన్నానా
గెలవగలం గగనాన్ని ఎవరాపినా
మరోసారి అను ఆ మాట మహారాజునై పొతాగా
ప్రతి నిమిషం నీకోసం
ప్రాణం సైతం పందెం వేసేస్తా
ఆ తరుణంలో కొత్తవరమో జన్మ ముడి వేసిందిరా
చిలిపితనమో చెలిమిగుణమో ఏమిటీ లీలా
స్వప్నలోకం ఏలుకుందాం రాగమాల
అదిగదిగో మదికెదురై కనబడలేదా
కథ మొదలనుకో తుది వరకు నిలబడగలదా
చరణం 2
పిలిచినదా చిలిపికలా వింటూనే వచ్చ్చేసా
తరిమినిదా చెలియనిదా తలుపు తీసా
వదిలినదా బిడియమిలా ప్రశ్నల్ని చెరిపేసా
ఎదురవదా చిక్కువలా ఎటో చూసా
భలేగుందిలా నీ ధీమా
భరిస్తుందిలే ఈ ప్రేమా
అదరకుమా బెదరకుమా
త్వరగా విదిరా సరదా పడదామా
పక్కనుంటేయ్ ఫక్కుమంటూ
నవ్వినాదా ప్రియతమా
చిక్కులుంటెయ్ బిక్కుమంటూ లెక్క చేస్తావా
చుక్కలన్నీ చిన్నబోవా చక్కనమ్మా
మమతానుకో మగతనుకో మతి చెడిపోదా
కథ మొదలనుకో తుది వరకు నిలబడగలదా