సినిమాపేరు : శ్యామ్ సింఘా రాయ్ || సంగీతదర్శకుడు : మిక్కీ జె మేయర్ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి|| పాడిన వారు : అనురాగ్ కులకర్ణి
పల్లవి:
నెలరాజుని ఇలరాణిని
కలిపింది కదా సిరివెన్నెల
దూరమా దూరమా తీరమై చేరుమా
నడిరాతిరిలో తెరలు తెరచినది
నిద్దురలో మగత మరచి ఉదయించినదా
కులుకులొలుకు చెలి మొదటికలా
తననవ్వులలో తళుకు తళుకు
తనచెంపలలో చమకు చమకు
తనమువ్వలలో ఝనకు ఝనకు
సరికొత్తకళ
డుండకడుండకడుండకడుండుం
డుండకడుండకడుండకడుం
డుండకడుండకడుండకడుండుం
డుండకడుండకడుండకడుం
చరణం 1
ఓ ఛాంగురే ఇంతటిదానాసిరి
అన్నది ఈ శారదరాతిరి
మిలమిలా చెలికన్నుల
తనకలలనుకనుగొని
అచ్చెరువున మురిసి
అయ్యహొ ఎంతటిదీ సుందరి
ఎవ్వరూ రారుకదా తనసరి
సృష్టికే అద్దము చూపగపుట్టినదేమో
నారిసుకుమారి
ఇది నింగికి నేలకి జరిగిన పరిచయమే
తెరదాటి చెరదాటి
వెలుగు చూస్తున్న భామని
సరిసాటి ఎదమీటి
పలకరిస్తున్న శ్యాముని
ప్రియమార గమనిస్తూ
పులకరిస్తోంది యామిని
కలబోసే ఊసులే ఓ ఓ
విరబోసే ఆశలై ఓ ఓ
నవరాతిరి పూసిన వేకువరేఖలు
రాసినదీనవలా
మౌనాలే మమతలై ఓ ఓ
మధురాలా కవితలై ఓ ఓ
తుదిచేరనికబురుల
కథాకళికదిలెను
రేపటికధలకు ముందుడిలా
తన నవ్వులలో తళుకు తళుకు
తన చెంపలలో చమకు చమకు
తన మువ్వలలో ఝనకు ఝనకు
సరికొత్తకళ
డుండకడుండకడుండకడుండుం
డుండకడుండకడుండకడుం
డుండకడుండకడుండకడుండుం
డుండకడుండకడుండకడుం
చరణం 2
ఇదిలాఅని ఎవరైనా
చూపనేలేదు కంటికి
అదెలాగో తనకైనా
తోచనేలేదు మాటకి
ఇపుడిపుడే మనసైన
రేపుదొరికింది చూపుకి
సంతోషం సరసన ఓ ఓ
సంకోచం మెరిసిన ఓ ఓ
ఆ రెంటికిమించిన పరవశలీలను
కాదనిఅనగలమా
ఆ కథకదిలే వరుసనా ఓ ఓ
తమఎదలేం తడిసినా ఓ ఓ
గతజన్మల పొడవున
దాచిన దాహముఇపుడే
వీరికి పరిచయమా
తన నవ్వులలో తళుకు తళుకు
తన చెంపలలో చమకు చమకు
తన మువ్వలలో ఝనకు ఝనకు
సరికొత్తకళ
తన నవ్వులలో తళుకు తళుకు
తన చెంపలలో చమకు చమకు
తన మువ్వలలో ఝనకు ఝనకు
సరికొత్తకళ
నెలరాజుని ఇలరాణిని
కలిపింది కదా సిరివెన్నెల
దూరమా దూరమా తీరమై చేరుమా
నడిరాతిరిలో తెరలు తెరచినది
నిద్దురలో మగత మరచి ఉదయించినదా
కులుకులొలుకు చెలి మొదటికలా
తన నవ్వులలో తళుకు తళుకు
తన చెంపలలో చమకు చమకు
తన మువ్వలలో ఝనకు ఝనకు
సరికొత్తకళ