సినిమాపేరు : వాన || సంగీత దర్శకుడు : కమలాకర్ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : రంజిత్
పల్లవి
ఉన్నట్టా లేనట్టా ఉండుంటే నిన్నేట్టా చేరాలె సిరి తునుక
విన్నట్టా లేనట్టా వింటుంటే నా మాట ఊకొట్టవే చిలక
నిదర చెడిన ఎద కుదుట పడదు కద
ఏదో చేసుంటావే నువ్వు అమ్మాయీ అన్యాయంగా
చరణం 1
తెలుసుకోనీ ఆకాశవాణి చెలియ వైనాన్ని
అడుగుపోనీ ఆ చిన్నదాన్ని నన్ను కలవమని
ఏమంత పని ఉందని పారిపోయింది సౌదామిని
ఏ సంగతీ చెప్పక
చరణం 2
మెరుపుతీగా! నీ మెలిక నాలో మిగిలిపోయిందే
చిలిపి సైగా! నా మనసు నీతో వలస పోయిందే
నువ్వు తాకినట్టుండగా ఓ తడి గొంతు వదిలావుగా
మరచి పోనివ్వక
ఉన్నట్టా లేనట్టా ఉండుంటే నిన్నేట్టా చేరాలె సిరి తునుక
విన్నట్టా లేనట్టా వింటుంటే నా మాట ఊకొట్టవే చిలక
నిదర చెడిన ఎద కుదుట పడదు కద
ఏదో చేసుంటావే నువ్వు అమ్మాయీ అన్యాయంగా